TG: ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలకు గోదావరి జలాలు పంపిస్తామని వెల్లడించారు. రైతుల కోరిక మేరకు సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు విడుదల చేస్తామన్నారు. గోదావరి జలాలను పొదుపుగా వాడుకొని పంటలు కాపాడుకోవాలని సూచించారు.
వార్తలు
పంటలకు గోదావరి జలాలు విడుదల చేస్తాం: తుమ్మల


