హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఆర్థిక వ్యవస్థ పరిమాణమే గీటురాయి కాదు’

62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మిడిల్ పవర్' దేశాన్ని నిర్వచించడం కష్టమన్నారు. కేవలం ఆర్థిక వ్యవస్థ పరిమాణం, జీ20లో సభ్యత్వం ఆధారంగా దీనిని అంచనా వేయలేమన్నారు. సెమీకండక్టర్స్ రంగంలో నెదర్లాండ్స్, అలాగే యూఏఈ దేశాలను ఉదాహరణగా చెప్పారు. ఎమర్జింగ్, మిడిల్ పవర్స్ విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.