హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంపులుగా వీధి కుక్కల సంచారం.. భయాందోళనలో ప్రజలు

MDK: హవేలిఘన్‌పూర్ మండలం సర్ధనలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బాటసారులు, వాహనదారులపైకి దూసుకొస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.