భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ ఏడాది 70,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రష్యా అంగీకరించిందని కేంద్రమంత్రి జైశంకర్ వెల్లడించారు. నిర్మాణ, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని చెప్పారు. రష్యా సైన్యంలో చిక్కుకున్న 140 మంది భారతీయులను విడిపించామని, మరో 55 మంది ఆచూకీ కోసం అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.
వార్తలు
భారతీయులకు రష్యాలో భారీగా ఉద్యోగాలు


