హైదరాబాద్: 28°C
వార్తలు

'త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లలను కనాలి'

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్‌ పటేల్‌ హిందూ యువత త్వరగా వివాహం చేసుకుని ఐదుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. గతంలో 20 ఏళ్లకే పెళ్లిళ్లు జరిగేవని, ఇప్పుడు వివాహాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావడంతో హిందువుల జనన రేటు 1.9కి తగ్గిందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యతపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.