హర్యానాలోని జింద్ జిల్లా సఫిదోలో బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. మువానాకి చెందిన పాయల్ సోదరుడితో కలిసి SBIలో రూ.1.25లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. సహాయం చేస్తున్నట్లు నటించిన ఓ దొంగ తొలుత ఫామ్‌లో అకౌంట్ నంబర్ తప్పుగా రాశాడు. క్యాషియర్ ఫామ్‌ను తిరస్కరించడంతో మరో ఫామ్ నింపుతున్నట్లు నటించి నగదుతో పరారయ్యాడు. CCTV ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వార్తలు
బ్యాంకులో ఘరానా మోసం


