AKP: ఇవాళ నరవలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన నాయకుడు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మెడికవర్ బృందం ఆధ్వర్యంలో గర్భసంచి క్యాన్సర్, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేస్తారు. అలాగే సాయి కంటి ఆసుపత్రి ద్వారా కంటి పరీక్షలు, ఉచిత శస్త్రచికిత్సలు, 50 శాతం రాయితీతో కళ్లద్దాలు అందిస్తారు. క్లౌడ్ డెంటల్ సిబ్బంది దంత పరీక్షలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత మెగా వైద్య శిబిరం


