AKP: ఈనెల 6న విశాఖపట్నంలోని అపోలో ఫార్మసీ ప్రాంతీయ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ట్రైనీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన యువతీ యువకులు దీనికి అర్హులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గోవింద రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 91541 17837 నంబరును సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 6న జాబ్ మేళా


