హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాక్లెట్లతో లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేక అలంకరణ

KDP: గోపవరం మండలం వల్లేరవారిపల్లెలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద మాసం సందర్భంగా ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల చాక్లెట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.