హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కేఈ కృష్ణమూర్తి బర్త్‌డే

KRNL: మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను క్రిష్ణగిరి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి కేఈ కృష్ణమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.