హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువ పూడికతీత పనుల పరిశీలన

W.G: నరసాపురం మండలం బియ్యపుతిప్పలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను శనివారం బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇంఛార్జ్ రామరాజు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కాలువల నిర్వహణపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కాలువల అభివృద్ధి, పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.