హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోటు తిరగబడి మత్స్యకారుడు గల్లంతు

కృష్ణా: మచిలీపట్నం మండలం కేపీపాలేనికి చెందిన తిరుమలశెట్టి గోపిరాజు (27) శనివారం సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి తోక బోటుపై వేటకు వెళ్లిన గోపిరాజు, తిరిగి వస్తుండగా సముద్రంలో అలల ఉద్ధృతికి బోటు తిరగబడి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు ఒడ్డుకు చేరుకోగా, గోపిరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.