హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శనివారం రాత్రి పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు SI వేమన చందన తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5,230 నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.