హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణలో రబీ విత్తన పంపిణీ ప్రారంభం

TG: రాష్ట్రంలో రబీ 2026-27 సీజన్‌కు సంబంధించి విత్తన పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఎల్‌నినో నేపథ్యంలో నీటి కొరత పరిస్థితులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో తక్కువ పెట్టుబడితో, స్వల్పకాలంలో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులను కోరారు. పంటలను కాపాడేందుకు నీటి పారుదల ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు.