VZM: రేగిడిలో ఎస్ఐ బాలకృష్ణ గత రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో కలిసి ప్రజలకు సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేగిడిలో ఎస్ఐ పల్లె నిద్ర


