హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో భారీగా పెరిగిన విద్యుత్ కొరత

దేశంలో విద్యుత్ కొరత భారీగా పెరిగింది. ఆగస్టులో 98 మిలియన్ యూనిట్లుగా(MU) ఉన్న లోటు సెప్టెంబర్‌లో ఏకంగా 544 MUలకు చేరి ఈ ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-ఆగస్టులో విద్యుత్ డిమాండ్ ప్రభుత్వ అంచనాల కంటే 3.3% అధికంగా నమోదైంది. వినియోగం పెరగడం, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడమే దీనికి ప్రధాన కారణం.