హైదరాబాద్: 28°C
వార్తలు

‘అన్యాయంపై పోరాటమా? 'సత్యాగ్రహ'లో చేరండి’

ప్రజా పోరాటాలను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించారు. NDA పాలనలో సత్యాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా ఎవరైనా తమకు జరుగుతున్న అన్యాయాలపై ఒంటరిగా కాకుండా ఈ వేదిక ద్వారా గళమెత్తాలని కోరారు. విపక్ష నేతగా వారి పోరాటాలకు మద్దతు ఇస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.