హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైవింగ్‌లో ఏమరుపాటు వద్దు!

HYD: డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి శ్రద్ధ రోడ్డుపైనే పెట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొన్ని సెకన్ల ఏమరుపాటు కూడా రియాక్షన్ టైమ్‌ను ఆలస్యం చేసి ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం, కంట్రోల్స్ సర్దడం, రోడ్డుపై నుంచి చూపు తిప్పడం వంటి చిన్న పొరపాట్లను కూడా నివారించాలని తెలిపారు.