హైదరాబాద్: 28°C
వార్తలు

కెమెరాల నిఘాలోనూ చెత్త.. చర్యలు ఎప్పుడు?

JN: జనగామ పట్టణంలో జనగామ–సూర్యాపేట జాతీయ రహదారిపై నెల్లుట్ల శివారు శ్రీనివాసనగర్‌ కాలనీ వంతెన సమీపంలో చెత్తాచెదారం, మాంసపు వ్యర్థాలు పడేస్తున్నారు. చెత్త వేయకుండా అధికారులు ఆగస్టులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. కెమెరా ఫుటేజీ ఆధారంగా బాధ్యులను గుర్తించి జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు.