హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

KRNL: ఆదోనిలో మహిళల భద్రత, సైబర్‌ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్‌ వినియోగం, అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందే విధానంపై డీఎస్పీ వెంకటరామయ్య అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని త్రీటౌన్‌ సీఐ రామలింగయ్య, ఎస్సై శివరాముడు సూచించారు. కార్యక్రమంలో NDA నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.