హైదరాబాద్: 28°C
వార్తలు

‘AIతో వాయుసేన బలోపేతం కావాలి’

భవిష్యత్ యుద్ధాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత దళంతో వాయుసేనను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని IAF చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఫ్రాన్స్‌తో 114 రఫేల్ యుద్ధ విమానాల(MRFA) కొనుగోలు ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో IAFకు ఏటా కనీసం 36-40 ఫైటర్ జెట్స్ అవసరమని ఉందని తెలిపారు.