KMM: ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్‌ను జయించవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో షిరిడీ సాయిబాబా ట్రస్ట్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి శనివారం ఆయన హాజరయ్యారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని, ప్రజలు ఉచిత పరీక్షలను వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
క్యాన్సర్ ముందస్తు పరీక్షలే రక్షణ: పొంగులేటి


