హైదరాబాద్: 28°C
వార్తలు

‘బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు జరపాలి’

దేశంలో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ చట్టవిరుద్ధమన్న ఆయన.. బ్యాలెట్ పేపర్ల ద్వారా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలంతా అక్రమంగా ఎన్నికయ్యారని.. వారందరినీ గద్దె దించాలని ఖర్గే అన్నారు.