హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యా సైన్యంలో మరో 55 మంది భారతీయులు

భారత్-రష్యా కన్సల్టేటివ్ కమిటీ భేటీలో రష్యా ఆర్మీలో చిక్కుకున్న భారతీయుల విడుదలపై కీలక చర్చలు జరిగాయి. అత్యున్నత స్థాయి చర్చల ద్వారా ఇప్పటివరకు 140 మందిని రష్యా ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేయించామని కేంద్రం తెలిపింది. మరో 55 మంది ఆచూకీ కోసం రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే, వీరిని మోసగించి పంపిన దళారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.