హైదరాబాద్: 28°C
వార్తలు

CNG ఫిల్ చేస్తుండగా కారు బ్లాస్ట్

కారులో CNG నింపుతుండగా జరిగిన భారీ పేలుడు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని కర్జన్ వద్ద NH-48పై ఉన్న బంక్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ఫిల్ చేస్తుండగా కారులోని సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో వెనుక భాగం తుక్కుతుక్కయింది. అదృష్టవశాత్తూ లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో రెండు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి.