హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌పై భారత్ విజయం.. కేంద్రమంత్రి అభినందనలు

2026 ఆసియా క్రీడల క్రికెట్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారత జట్టు అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. 'అద్భుతం, అమోఘం.. పాక్‌పై భారత్ అద్వితీయమైన ఆటతీరు కనబరిచింది. అద్భుత ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు' అని ఆయన 'X'లో పోస్ట్ చేశారు.