హైదరాబాద్: 28°C
వార్తలు

సంచార లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం

TG: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార లోక్ అదాలత్ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హైకోర్టు సీజే అపరేశ్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మోహన, అలోక్ అరాధే, మహదేవన్ పాల్గొన్నారు. మొబైల్ లోక్ అదాలత్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయని పేర్కొన్నారు.