హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల వెళ్లే ప్రయాణికులకు అలర్ట్

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ రైడ్స్‌ను తిరుమలకు అనుమతించొద్దని నిర్ణయించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ రైడ్స్‌కు అనుమతి లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది. కొండపైకి వెళ్లే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బుక్ చేసుకోవద్దని వెల్లడించింది.