హైదరాబాద్: 28°C
వార్తలు

సేఫ్టీ ఆడిట్‌కు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

AP: తిరుపతి జిల్లా శ్రీసిటీలో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై పవన్ విచారం వ్యక్తం చేశారు. శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.