హైదరాబాద్: 28°C
వార్తలు

కేదార్‌నాథ్ యాత్ర.. భక్తులపై కర్రలతో దాడి!

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. జంగిల్‌చట్టి ప్రాంతంలో భక్తులు, మ్యూల్ హ్యాండ్లర్ల మధ్య వివాదం చెలరేగింది. ఇది తీవ్రరూపం దాల్చడంతో.. ముంబైకి చెందిన పలువురు భక్తులపై మ్యూల్ హ్యాండ్లర్లు కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.