AKP: మర్రిబంద జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఫ్రూట్స్ లోడ్ టాటా వాహనం, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం


