NTR: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని రకాల దర్శనం టికెట్లను రద్దు చేసి, భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించారు. ఘాట్‌రోడ్డు మరమ్మతులతో మహామండపం వద్ద రద్దీ పెరగడంతో లిఫ్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి ర్యాంప్, పాతమెట్ల మార్గం ద్వారా భక్తులను అనుమతించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం


