ప్రైవేటు రంగంలో తల్లిదండ్రులు పనిచేస్తుంటే వారికి కూడా శిశు సంరక్షణ సెలవులు పొందే విధానం అమలు చేయాలని కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సు చేసింది. తొలుత భారీ పరిశ్రమల్లో.. తర్వాత మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు దీన్ని విస్తరించాలని సూచించింది. ఈ మేరకు 37 సిఫార్సులతో నివేదిక ఇచ్చింది. శిశు సంరక్షణకు 730 రోజుల సెలవులను తల్లిదండ్రులు పంచుకునేలా వీలు కల్పించాలని తెలిపింది.
వార్తలు
'ప్రైవేటు సెక్టారులోనూ శిశు సంరక్షణ సెలవులివ్వాలి'


