హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలకు దెబ్బతిన్న లొద్ద రహదారి

PPM: సాలూరు నియోజకవర్గంలోని లొద్ద గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రహదారులకు మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట్ల బీటీ రహదారులు నిర్మిస్తామని ఏఈ సత్యనారాయణ తెలిపారు. త్వరలో పనులు చేపడతామన్నారు.