AP: రాష్ట్రంలో ఇవాళ అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈనెల 12న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇది 15న వాయుగుండంగా బలపడితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వార్తలు
ALERT: పిడుగులతో కూడిన వర్షాలు


