యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని కాంగ్రెస్, ఎస్పీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 403 స్థానాలకు తమ పార్టీకి 150 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే హస్తం పార్టీకి 53-55 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదించింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ అంత బలంగా లేదని అందుకే ఇంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమని వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
వార్తలు
కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు ఇస్తాం: ఎస్పీ


