యూపీ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. సుథా గ్రామంలోని ఒక ఆలయలో బాబా గోపాల్, బాబా బిహారీ దాస్ అనే ఇద్దరు సాధువులను ఆధిపత్యం కోసం ఓ వ్యక్తి హత్య చేశాడు. వీరు నిద్రిస్తున్న సమయంలో ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పు పెట్టి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
వార్తలు
దారుణం.. ఇద్దరు సాధువుల హత్య


