బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. చంపారన్ జిల్లాలోని బంకాట్ గ్రామంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లి నలుగురు బాలికలు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అక్కాచెల్లెలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పిల్లలు మరణించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
విషాదం.. చెరువులో మునిగి నలుగురు బాలికలు మృతి


