హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధాశ్రమానికి విశ్రాంత ఇంజనీర్ల విరాళం

JGL: జగిత్యాలలోని విశ్వకర్మ సంక్షేమ సంఘం వృద్ధాశ్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం రూ.50 వేల విరాళం అందజేసింది. అనాథల సంక్షేమానికి సాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని సంఘం అధ్యక్షుడు, ఎన్‌సీడీసీఎల్‌ మాజీ డైరెక్టర్‌ గణపతి తెలిపారు. ఏటా రూ.8 లక్షల సాయం అందిస్తున్నట్లు కార్యదర్శి లక్ష్మయ్య చెప్పారు.