హైదరాబాద్: 28°C
వార్తలు

యువ వైద్యులను అభినందించిన గవర్నర్

HYD: తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గోల్డ్ మెడలిస్టులైన డాక్టర్ వై.శ్రవణ్ కుమార్ (యూరాలజీ), డాక్టర్ వై. ఆకాంక్ష (కార్డియాలజీ)లను అభినందించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. వారి వైద్య వృత్తిలో సమాజ సేవలు నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్య నైపుణ్యానికి, మానవాళికి వారు చేసిన సేవను అభినందించారు.