హైదరాబాద్: 28°C
వార్తలు

పాడేరు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట

ASR: పాడేరు మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేపట్టారు. 18మంది కార్మికులు 16, 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, వారిపై పని భారం పెరిగిందని, సిబ్బంది పెరగలేదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వేతనాలు చెల్లిస్తున్నారని, ఉద్యోగ భద్రత లేదన్నారు.