హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారి విగ్రహం ధ్వంసానికి ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్

RR: దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని ఓ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు 30-40 ఏళ్ల వ్యక్తి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పూజారి, భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.