హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో చొరబాటుకు యత్నం.. ఇద్దరు మృతి

పంజాబ్ తార్న్ తారన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు పాక్ చొరబాటుదారులను కాల్చి చంపినట్లు BSF జవాన్లు తెలిపారు. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లు కదలికలను గుర్తించి.. వారిని హెచ్చరించారు. అయినా అక్రమంగా చొరబడేందుకు యత్నించడంతో కాల్పులు జరిపి హతమార్చారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది.