హైదరాబాద్: 28°C
వార్తలు

పెండింగ్ చలాన్లపై సుప్రీం సంచలన తీర్పు

పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెండిగ్ చలాన్లు ఉన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేవలం చలాన్లు విధిస్తే సరిపోదని.. వాటిని వసూలు చేయడంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. అకస్మాత్తుగా రోడ్లపై తనిఖీలు చేసినప్పుడు, పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలితే ఆ వాహనాలను వెంటనే సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.