హైదరాబాద్: 28°C
వార్తలు

అదే మన బాధ్యత: మోహన్

వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు, సాధువుల బోధనల నుంచి భారత్‌కు వచ్చిన జ్ఞానం ప్రపంచానికి చాలా అవసరమని RSS చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. మన దేశం, ధర్మం వేర్వేరు కాదని తెలిపారు. దేశాన్ని నిలబెట్టడంలో ధర్మం సహాయపడుతుందని చెప్పారు. దేశం బలహీనపడితే ధర్మానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. దేశాన్ని, ధర్మాన్ని రెండింటినీ ముందుకు తీసుకువెళ్లడమే మన బాధ్యత అని సూచించారు.