హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్-కొరియా వాణిజ్య బంధంపై చర్చలు

అమెరికాలో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశంలో దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి పార్క్ జంగ్-సంగ్‌తో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. భారత్-కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(CEPA) అభివృద్ధి, వాణిజ్య వృద్ధిపై చర్చించినట్లు గోయల్ ట్వీట్ చేశారు. మన వ్యవసాయ, ఫార్మా, సముద్ర ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్, భారత్‌లో కొరియా తయారీ రంగ పెట్టుబడులపైనా మంతనాలు జరిపారు.