హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో వేసవిని తలపిస్తున్న ఎండలు

TG: రాష్ట్రంలో మార్చి నెల తరహాలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరో రెండు వారాలు ఎండల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం వేళల్లో స్వల్పంగా చల్లటి వాతావరణం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి దక్షిణ తెలంగాణలో వర్షాలు, అక్టోబర్ 12 వరకు అక్కడక్కడ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.