భారతీయ చిత్రకళకు ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చిన దిగ్గజ చిత్రకారుడైన రాజా రవివర్మ వర్ధంతి నేడు. దేవుళ్లు, పురాణ పాత్రలకు సజీవ రూపం ఇచ్చి ప్రతి ఇంటా పూజలందుకునేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పాశ్చాత్య శైలిని, భారతీయ సంప్రదాయాన్ని మేళవించి ఆయన వేసిన అద్భుత చిత్రాలు అజరామరం. అపురూప కళాఖండాలను అందించిన రాజా రవివర్మకు ఈ సందర్భంగా కళాభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
వార్తలు
రంగులతో పురాణాలకు ప్రాణం పోసిన రారాజు


