హైదరాబాద్: 28°C
వార్తలు

గాంధీ, శాస్త్రిలకు కాంగ్రెస్ అగ్రనేతల నివాళి

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజయ్ ఘాట్ వద్ద శాస్త్రిజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో కలిసి రాజ్‌ఘాట్ చేరుకున్న రాహుల్.. మహాత్ముడి సమాధి వద్ద పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు.