మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శాస్త్రి సమాధి వద్ద పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు. దేశ ప్రగతి కోసం శాస్త్రి చేసిన నిస్వార్థ సేవలను, ఆయన నిరాడంబర జీవితాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము స్మరించుకున్నారు.
వార్తలు
శాస్త్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి


